మాజీ CM పోస్టర్‌పై మూత్రం పోస్తూ.. వీడియో వైరల్, వెంటనే అరెస్ట్

మాజీ CM పోస్టర్‌పై మూత్రం పోస్తూ..  వీడియో వైరల్, వెంటనే అరెస్ట్

ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి మాజీ సీఎం అయిన సవాజ్ వాదీ పార్టీ నాయకుడి పోస్టర్ పై మూత్ర విసర్జన చేస్తూ ఫేస్ బుక్ లో లైవ్ పెట్టాడు. ఆ వీడియో వైరలై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వారణాసిలో అఖిలేష్ యాదవ్ పోస్టర్‌పై యూరిన్ పోస్తూ ఫేస్ బుక్ లైవ్ వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు, నాయకులు దీనిపై బగ్గుమని మండిపడ్డారు. మొదట ఆ వ్యక్తి అఖిలేష్ యాదవ్ ని తిట్టుకుంటూ వీడియో చేసి.. తర్వాత ఆయన ఫొటో ఉన్న పోస్టర్ పై మూత్రం పోసి ఉమ్మాడు. 


క్షణాల్లో ఆ వీడియో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పని చేసిన యువకుడు చోలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో నివసిస్తున్న బడే లాల్ చౌహాన్‌గా గుర్తించారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు చోలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు.